న్యూఢిల్లీ: డబ్బుల కోసం ఇతరులను కిడ్నాప్ చేసి బెదిరించిన ఉదంతాల గురించి వినే ఉంటాం. కానీ ఇక్కడో వ్యక్తి డబ్బుల గురించి తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. వివరాలు.. ఢిల్లీకి చెందిన సుశాంత్ చౌదరి అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేస్ కంపెనీలో ఆపరేట్‌గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్ చేసే అలవాటు ఉన్న సుశాంత్.. అందులో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ డబ్బుల్ని రికవర్ చేయాలనుకున్న సుశాంత్ సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా ఆడాడు. మీ కొడుకు మా నుంచి 1.5 లక్షలు లోన్‌గా తీసుకున్నాడని.. అందులో ఇంకా సంగం చెల్లించాల్సి ఉందని తన ఫోన్ నుంచి తండ్రికి మెసెజ్‌లు పంపాడు. కొడుకు కోసం తండ్రి డబ్బులు పంపాడు. తర్వాత రెండు రోజులకు మరోసారి డబ్బులు పంపాలంటూ మెసెజ్ రావడంతో.. సుశాంత్ తండ్రి తేజ్ పాల్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే.. ఎక్కువగా ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీకి డబ్బులు వెళ్లినట్లు గుర్తించారు. తేజ్ పాల్ సింగ్ డబ్బులు పంపిన సుశాంత్ అకౌంట్‌ను ట్రాక్ చేయడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో డబ్బులు డ్రా చేస్తున్న ఏరియాల్లో పోలీసులు రెక్కీ నిర్వహించడంతో సుశాంత్ పట్టుబడ్డాడు. తాను ఆన్లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నానని.. అవి తీర్చడం కోసం అప్పులు కూడా చేసినట్లు సుశాంత్ తెలిపాడు. ఆ అప్పులు తీర్చాలని ఇంట్లో చెబితే.. డబ్బులు ఇవ్వరని.. అందుకు ఇలా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులకు సుశాంత్ తెలిపాడు. దాంతో పోలీసులు.. సుశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
డబ్బుల కోసం సెల్ఫ్ కిడ్నాప్.. రంగంలోకి పోలీసులు
- దేశం
- October 1, 2021
లేటెస్ట్
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్‌తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్‌కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్‌లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి