తబ్లిగిలో పాల్గొన్న 536 మంది ఫారినర్స్ పై కేసులు

తబ్లిగిలో పాల్గొన్న 536 మంది ఫారినర్స్ పై కేసులు
  • ఇప్పటికే 32 దేశాలకు చెందిన 376 మందిపై చార్జిషీట్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఫారినర్స్ పై ఢిల్లీ పోలీసులు కేసులు ఫైల్ చేస్తున్నారు. మూడు దేశాలకు చెందిన 536 జమాత్ సభ్యులపై సాకేత్ కోర్టులో 12 కొత్త చార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్లు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు 32 దేశాలకు చెందిన 374 మంది ఫారినర్స్ పై చార్జిషీట్లు దాఖలు చేశారు. వీసా రూల్స్ ఉల్లంఘించారని, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించలేదని వారిపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇప్పటివరకు 900కు పైగా నిందితులున్నారని అధికారులు కోర్టుకు తెలిపారు. విజిటింగ్ వీసా మీద ఇక్కడకు వచ్చి మిషనరీ పనులు చేస్తున్నందుకు వీసా రూల్స్ ఉల్లంఘన జరిగిందని, వీరందరి వీసాలు బ్లాక్ లిస్ట్ చేసి రద్దు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమంతో దేశంలో కరోనా వ్యాప్తి పెరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెగా ఆపరేషన్ ద్వారా 25,500 మందికి పైగా తబ్లిగి సభ్యులను, వారి కాంటాక్ట్స్ ను ట్రేస్ చేసి క్వారంటైన్ లకు తరలించారు.