పట్టాలు తప్పిన రైలు..తప్పిన పెను ప్రమాదం

పట్టాలు తప్పిన రైలు..తప్పిన పెను ప్రమాదం

మరో రైలు ప్రమాదానికి గురైంది. ఢిల్లీలో ఓ రైలు పట్టాలు తప్పింది. న్యూఢిల్లీలోని భైరాన్ మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రైలు పట్టాలు త‌ప్పింది.ఈ  ఘ‌ట‌న‌లో ఓ రైలు బోగి ధ్వంసం అయింది.  న్యూఢిల్లీలోని ప్రగ‌తి మైదాన్ స‌మీపంలో హ‌ర్యానాలోని ప‌ల్వాల్ నుంచి ఢిల్లీ స్టేష‌న్‌కు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అటు పట్టాలు తప్పిన సమయంలో మరో ట్రాక్ పై ఏ ట్రైన్ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రైలు పట్టాలు తప్పడంతో ఘటనా స్థలికి రైల్వే సిబ్బంది చేరుకుని మరమ్మతులు చేపట్టారు. రైలు ప‌ట్టాలు త‌ప్పడంతో ప్రయాణికుల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు తెలిపారు. అంద‌రూ క్షేమంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.