ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. గతంలో మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయాల జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని 500 వరకు తగ్గించింది. అలాగే ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవచ్చని చెప్పారు.అంతేకాదు బస్సులు, మెట్రో రైళ్లలో విధించిన నిబంధనలను సడలించింది.వాటిల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించామన్నారు అధికారులు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో దుకాణాలు, రెస్టారెంట్లు, అర్థరాత్రి వరకు తెరిచి ఉంటాయి. 

మరిన్ని వార్తల కోసం

బంకర్ నుంచి వీడియో తీసి పంపిన హైదరాబాద్ విద్యార్థులు

ఉక్రెయిన్‎లో ఓ తండ్రి వ్యథ.. కన్నీళ్లు పెట్టించే వీడియో..