ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో గ్రూప్ క్రియేట్ చేసి గ్యాంగ్ రేప్ కు ప్లాన్

ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో గ్రూప్ క్రియేట్ చేసి గ్యాంగ్ రేప్ కు ప్లాన్

న్యూఢిల్లీఢిల్లీలో కొందరు స్టూడెంట్లు దారి తప్పారు. వికృత చేష్టలకు దిగారు. కేవలం సెక్స్, రేప్ గురించి చర్చించుకునేందుకే ఓ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. తోటి స్టూడెంట్ల ఫొటోలను మార్ఫ్ చేసి పైశాచిక ఆనందం పొందారు. గ్యాంగ్ రేప్ చేసేందుకు ప్లాన్లు వేశారు. చివరికి మొత్తం వ్యవహారం బట్టబయలైంది.

అసలేం జరిగింది?

ఢిల్లీలోని నాలుగైదు ఫేమస్ స్కూళ్లల్లో చదువుతున్న 22 మందికిపైగా స్టూడెంట్లు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ‘బాయ్స్ లాకర్ రూం’ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అందరూ 15–18 ఏళ్లు ఉన్న యువకులు. కొందరు 11, 12వ క్లాస్ చదువుతున్నారు. గ్రూప్​లో అమ్మాయిల గురించి, తోటి స్టూడెంట్ల గురించి అసభ్యంగా చర్చించుకున్నారు. అమ్మాయిల న్యూడ్ ఫొటోలను గ్రూపులో పోస్టు చేసి వారిపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. తమ క్లాస్ మేట్స్​ను గ్యాంగ్ రేప్ చేయాలని కూడా ప్లాన్ చేశారు.

బయట పడిందిలా…

‘బాయ్స్ లాకర్ రూం’ గ్రూప్​లోకి ఈ మధ్య ఓ అబ్బాయిని చేర్చుకున్నారు. అతడు తనకు తెలిసిన అమ్మాయికి చాటింగ్ స్క్రీన్ షాట్లను పంపాడు. అయితే అందులో తన ఫొటోలు కూడా ఉండటంతో ఆ అమ్మాయి స్కూలులో కంప్లయింట్ చేసింది. దీంతో స్కూల్ అడ్మినిస్ర్టేషన్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న ఆ గ్రూపు సభ్యులు.. తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌‌‌‌‌‌‌‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు స్టూడెంట్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్​ను సీజ్ చేశారు. గ్రూప్​ను డీయాక్టివేట్ చేశారు.ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్​లో ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ‘బాయ్స్ లాకర్ రూమ్’ హాష్​ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆ గ్రూప్​లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.