ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

ఢిల్లీలో స్కూల్స్ కాలేజీలు పున: ప్రారంభం అయ్యాయి. దేశ రాజధానిలో గాలి కాలుష్యం కారణంగా గత కొద్ది రోజులుగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగు పడటంతో తిరిగి స్కూల్స్ ను ప్రారంభించుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు వారాలుగా అక్కడ స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కాలుష్య స్థాయి కాస్త తగ్గడంతో విద్యాసంస్థలన్నీ రీ ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.

దీపావళి తర్వాత కాలుష్యం ఎఫెక్ట్ తో ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకీ పడిపోతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నియంత్రణ చర్యల్లో భాగంగా భారీ వాహనాలను ఢీల్లీలోకి నిషేధించారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీస్ లపై కూడా ఆంక్షలు విధించారు. ఇటీవల ఢిల్లీలో ఎయిర్ పోల్యూషన్ పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రమంగా ఎయిర్ క్వాలిటీ పెరుగుతుండటంతో ఆంక్షలు తొలగిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలకు అనుమతి ఇచ్చిన ఢిల్లీ సర్కార్ భారీ వాహనాలపై నో ఎంట్రీ ని ఆంక్షలు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఇంకా ఎయిర్ క్వాలిటీ ఆందోళన కలిగించేలా ఉందంటూ ప్రభుత్వ లెక్కలతో తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ, యూపీ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ కాలుష్యం తగ్గడం లేదు. నొయిడా, మొరాదాబాద్ ఏరియాల్లో ఇప్పటికీ ప్రమాదకరస్థాయిలోనే కాలుష్యం ఉందని అధికారులు తెలిపారు. దీంతో చాలా ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్మేసింది. విజిబులిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.