
ఢిల్లీ: మన దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో రాహుల్ గాంధీ ఒకరు. రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లిన ఏదో ఒక సందర్భంలో.. ఎవరో ఒకరు పెళ్లి ఎప్పుడనే ప్రశ్న లేవనెత్తుతూనే ఉంటారు. తాజాగా.. దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్ ఢిల్లీలోని ఒక ఫేమస్ స్వీటు షాపును రాహుల్ గాంధీ విజిట్ చేసిన సందర్భంలో కూడా ఆయన పెళ్లి ప్రస్తావన రావడం విశేషం.
ఘంటేవాలా స్వీట్ షాప్ ఓనర్ సుశాంత్ జైన్తో రాహుల్ గాంధీ సరదాగా ముచ్చటించారు. వ్యాపారం ఎలా నడుస్తుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. రాహుల్ గాంధీ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆయనతోనే ఈ స్వీట్ షాప్ ఓనర్ చెప్పడం కొసమెరుపు. అంతేకాదు.. ఆ పెళ్లిలో స్వీట్ ఆర్డర్స్ తమకే ఇవ్వాలని ఈ స్వీట్ షాప్ ఓనర్ కోరడం విశేషం.
ఓల్డ్ ఢిల్లీలోని ఫేమస్ ఘంటేవాలా స్వీట్ షాపులో ఇమార్తి, బేసన్ లడ్డూ తయారు చేయడానికి ప్రయత్నించానని, శతాబ్దాల నాటి ఈ ఐకానిక్ షాపు మాధుర్యం అలాగే ఉందని రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ స్వీట్ షాప్ ఓనర్కు రాహుల్ గాంధీ కుటుంబంతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది.
రాజీవ్ గాంధీ కూడా తమ స్వీట్ షాపులో తయారైన స్వీట్లను ఎంతో ఇష్టంగా తినేవారని స్వీట్ షాప్ ఓనర్ చెప్పారు. దీపావళికి టపాసులు ఎంత ఫేమసో.. స్వీట్లు కూడా అంతే ఫేమస్. నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్లంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే.
पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।
— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025
सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है - ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।
दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ