ఆస్తి వివాదంతోనే ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ హత్య..బెంగాల్ దంపతుల అరెస్ట్‌

ఆస్తి వివాదంతోనే ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ హత్య..బెంగాల్ దంపతుల అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఆస్తి గొడవతోనే ఢిల్లీ వర్సిటీ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య జరిగినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. బెంగాల్‌కు చెందిన దంపతులతోపాటు వారి మైనర్‌‌ కొడుకును ఆదివారం అరెస్ట్‌ చేశారు. బెంగాల్‌లోని బర్దమాన్‌లో ఉన్న తన పూర్వీకుల ఆస్తిని అమ్మేందుకు దేవోస్మిత నిరాకరించడంతో నిందితులు ఢిల్లీకి వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలిపారు. బర్దమాన్లోని దేవోస్మిత పాల్‌కు వారసత్వంగా సంక్రమించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న బెంగాల్‌కు చెందిన దంపతులు.. ఆ ఇంటినే ఆక్రమించుకునేందుకు యత్నించారు.

ఇది తెలిసి ప్రొఫెసర్ పాల్ వెంటనే వారిని ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో పాల్‌ను చంపి ఇల్లును దక్కించుకోవాలనుకున్నారు. జూన్ 3న ఢిల్లీలోని దేవోస్మిత ఫ్లాట్‌కు వెళ్లిన నిందితులు ఆమెను బ్లేడ్‌తో  దాడి చేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు సీసీటీవీలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.