న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ స్టార్టప్ కంపెనీ జెప్టో వచ్చే వారం ప్రారంభంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తన అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ పత్రాలను సమర్పించనుంది. ఈ నెల చివరిలో లేదా జులైలో ఐపీఓకి రావాలని చూస్తోంది. ఫైలింగ్ ముగిసిన వెంటనే ఇన్వెస్టర్ రోడ్‌షోలను కంపెనీ ప్రారంభించనుంది.
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా జెప్టో ఒక బిలియన్ డాలర్ల (రూ. 9,600 కోట్లకు పైగా) నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇటీవలి కాలంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఐపీఓ కానుంది. 2021లో ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రాలు స్థాపించిన ఈ సంస్థ రోజువారీ ఆర్డర్ల సంఖ్య ప్రస్తుతం 25 లక్షలకు చేరుకుంది. కంపెనీ నెట్ ఆర్డర్ వాల్యూ 2025 చివరి నాటి 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,800 కోట్ల) నుంచి ప్రస్తుతం దాదాపు బిలియన్ డాలర్ల (రూ.9,600 కోట్ల)కు పెరిగింది.
