ఎలివేటెడ్ మెట్రో ట్రాక్‌పై మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆ తర్వాతేమైందంటే

ఎలివేటెడ్ మెట్రో ట్రాక్‌పై మహిళ ఆత్మహత్యాయత్నం.. ఆ తర్వాతేమైందంటే

డిసెంబర్ 11న సాయంత్రం సెంట్రల్ ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ మెట్రో ట్రాక్‌పై నుంచి రోడ్డుపైకి దూకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వెంటనే స్పందించిన షాదీపూర్ మెట్రో స్టేషన్‌లో మోహరించిన భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ ఎలివేటెడ్ మెట్రో ట్రాక్‌పై నడుచుకుంటూ రోడ్డుపై దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అనంతరం పోలీసులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా అవుతోంది. ఈ వీడియోలో, మహిళ ఎలివేటెడ్ మెట్రో ట్రాక్‌పై నిలబడి ఉంది. ఆమె ఒక చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం, కళాశాల విద్యార్థిని అయిన మహిళ ఓ సమస్యపై తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో, షాదీపూర్ మెట్రో స్టేషన్‌లో ఆ మహిళ మెట్రో నుండి దిగి ట్రాక్‌పై నడవడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఆమెను చూడగానే, కింద ఉన్న రోడ్డులో ఉన్న వ్యక్తులు అరుస్తూ, వెనక్కి వెళ్ళమని అడిగారని, కానీ ఆ మహిళ అలాగే బెదిరించిందని అన్నారు. ఆ తర్వాత మెట్రో స్టేషన్‌లో మోహరించిన భద్రతా సిబ్బంది ఆమెను రక్షించగలిగారని అధికారి తెలిపారు.