న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్

న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్

న్యూ ఇయర్ రోజున దేశ రాజధాని ఢిల్లీలో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయింది. ఫేమస్ ప్లేసెస్ అయిన ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్, జాతీయ రాజధానిలోని వివిధ మతపరమైన ప్రదేశాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. లుట్యెన్స్ ఢిల్లీ ప్రాంతంలోని అనేక రహదారులు మెట్రో స్టేషన్‌ల లోపల, వెలుపల సర్పెంటైన్ క్యూలతో నిండిపోయాయి. మెట్రోలో, రోడ్లపై, సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాలలోనూ ఎక్కడా ఖాళీ లేదని ఒక ప్రయాణీకుడు చెప్పడం వింటుంటేనే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజలు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలోకి రావడానికీ, బయటికి వెళ్లడానికి చాలా కష్టపడుతున్నారని, చాలా మంది ప్రయాణికులు వాపోయారు. స్మార్ట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ టిక్కెట్లు ఉన్నవారిని సెక్యూరిటీ చెక్‌పోస్టుల వద్దకు వెళ్లేందుకు CISF సిబ్బంది ముందు అనుమతించినా.. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌లో ప్రవేశం మూసివేయబడిందని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇండియా గేట్, ప్రాచిన్ హనుమాన్ మందిర్, బంగ్లా సాహిబ్ గురుద్వారా, కన్నాట్ ప్లేస్ సర్కిల్ వద్ద భారీగా జనం గుమిగూడడంతో ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. జాతీయ రాజధానిలోని ఇతర ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ భారీగా కనిపించింది. పరిస్థితి గురించి వివరిస్తూ చాలా మంది Xలో వీడియోలు, ఫొటోలు పంచుకున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తర్‌పూర్, బరాఖంబ క్రాసింగ్‌లో మండి హౌస్ వైపు, రాజేంద్ర ప్రసాద్ మార్గ్ రౌండ్‌ అబౌట్, సరాయ్ కాలే ఖాన్ ఫ్లైఓవర్, మథుర రోడ్, సింగు బోర్డర్ నుండి ముకర్బా చౌక్‌తో పాటు ఇతర ప్రాంతాలలో భారీ ట్రాఫిక్ కనిపించింది.