అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి

అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి

రీల్స్ పిచ్చి జనాల్లో బాగా ముదిరిపోయింది. సెలబ్రిటీ కావాలనే పిచ్చితో ఎక్కడపడితే అక్కడ.. ఏదీ పడితే అది వీడియోలు చేసి ఇంటర్నెట్ లో పెట్టడం చాలా కామ న్ అయిపోయింది. కొన్ని లైకుల కోసం.. సోషల్ మీడియా ఖాతాలతో డబ్బు సంపాదించడం కోసం ఏదైనాచేయడానికి సిద్దపడుతున్నారు. మెట్రో, రైళ్లు, బస్సు లు, బస్టాండ్లు ఇలా పబ్లిక్ ప్లేసుల్లో..క్రేజీ డ్రెస్సింగ్ తో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటిదే తాజాగా ఓ సంఘటన ఢిల్లీలో జరిగింది..ఓ యువతి బికినీ తో బస్సులోకి ఎక్కి ప్రయాణికులను ఆశ్చర్యం, గందరగోళానికి గురి చేసింది. 

ఢిల్లీలో ఓ యువతి బికినీలో బస్సు ఎక్కిన షాకింత్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియా క్లిప్ లో మహిళను చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ కు 1మిలియన్ నెటిజన్లు చూశారు. అయితే ఆ యువతి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు. బీచ్ లలో వేసుకునే తిరిగే బికినీలో బస్సుల్లో ప్రయాణించడం ఏంటీ..సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడానికి ఇంతకు తెగించాలాని అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి వీడియోలతో ఎందుకు ప్రజల ను గందరగోళానికి గురిచేస్తున్నారని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. 

కొన్ని లైకులు, సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలనే పిచ్చితో ఏదైనా చేయడానికి సిద్దపడుతున్నారని.. పబ్లిక్ లో ఇలాంటి వేషాలేంటని  ఓ నెటిజన్ తీవ్రస్థాయి విరుచుకుపడ్డాడు. ఢిల్లీ ఆర్టీసీ యాజమాన్య ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. 

మెట్రో, రైళ్లు, బస్సు లు, బస్టాండ్లు ఇలా పబ్లిక్ ప్లేసుల్లో..క్రేజీ డ్రెస్సింగ్ తో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటిదే తాజాగా ఓ సంఘటన ఢిల్లీలో జరిగింది..