ఢిల్లీలో పూర్ కేటగిరిలోకి ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో పూర్ కేటగిరిలోకి ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మళ్లీ పెరిగింది. నిన్న మోడరేట్ కేటగిరిలో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ పూర్ కేటగిరిలోకి చేరింది. ఎయిర్ పొల్యూషన్ తగ్గిందనుకునేలోపు మళ్లీ పెరిగిందని స్థానికులు అంటున్నారు. నిన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 176తో మోడరేట్ కేటగిరీగా నమోదవ్వగా.. ఇవాళ AQI 283కు చేరుకుంది. దీంతో పూర్ కేటగిరిగా రికార్డ్ అయింది. 

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది. శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న వారు ఊపిరి తీసుకునే పరిస్థితి లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐటీ, ఇతర కీలక సంస్థలు కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేయగా.. వీటిలో బీహార్‌లోని కతిహార్‌ నగరంలో గాలి నాణ్యత (360 పాయింట్లు) పడిపోయినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ (354 పాయింట్లు) ఉంది. ఆ తర్వాత నోయిడా (328), ఘజియాబాద్‌ (304) ఉన్నాయి.