దీపావళి స్పెషల్ మిఠాయి 'కాజు కలశ్'

దీపావళి స్పెషల్ మిఠాయి 'కాజు కలశ్'

దీపావళి అంటే దీపాలు, పటాసులతో పాటు వెంటనే గుర్తొచ్చేది మిఠాయిలు, స్వీట్లు. వీటికి మామూలు రోజుల్లో కన్నా ఈ సమయంలో డిమాండు కొంచెం ఎక్కువే. సాధారణంగా అయితే కిలో మిఠాయి ధర రూ.500 లేదా 600 ఉంటుంది. మరీ ఎంత కాదన్న వెయ్యి రూపాయలైతే దాటదేమో. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మిఠాయిని మాత్రం కిలోకి రూ.20వేలకు విక్రయిస్తున్నారు.   కాస్ గంజ్ లో ఉన్న రోషన్‌లాల్‌ స్వీట్స్‌ షాప్ లో అమ్ముతున్న ఈ మిఠాయిల పేరు కాజు కలశ్.

దీపావళి పండగ వచ్చిదంటే చాలు చిన్నా, పెద్దలతో కలిసి ఇళ్లంతా సందడి మారుతుంది. రకరకాల స్వీట్స్ ను పంచిపెడుతూ ఇంటిల్లిపాదీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండగ రోజు.. ఈ కాజు కలశ్ ను కొనాలంటే కొంచెం ఖరీదుతో కూడుకున్నదే. అయితే కేజీ రూ.20వేలకు అమ్ముతున్న అంత చెప్పుకునేంత ఏం ప్రత్యేకతలున్నాయి అన్న విషయానికొస్తే.. దీన్ని బంగారంతో తయారు చేస్తారట. అందుకనే వీటి రుచి సూపర్బ్ గా ఉంటుందట. ఈ మిఠాయి తయారీలో 24 క్యారెట్ల బంగారంతో పాటు పైన్‌ గింజలు, కశ్మీర్‌లో లభించే కిశోరీ పిస్తా, కుంకుమపువ్వు వంటివి ఉపయోగించామని షాప్ యజమాని రజత్‌ మహేశ్వరి చెప్పారు. అంతేకాదు.. ఈ ప్రత్యేకతల కారణంగానే తాము తయారుచేసిన ‘కాజూ కలశ్‌’ మిఠాయి మిగతా స్వీట్స్ కంటే టెస్టీగా ఉంటుందన్నారు.