డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో ఊరట

డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో ఊరట
  • డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో ఊరట
  • రూ.16,195 కోట్ల ట్యాక్స్ నోటీసుపై ఫైనల్ ఆర్డర్ ఇవ్వొద్దని జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ అధికారులకు ఆదేశం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హియరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  హైకోర్టులో ఊరట లభించింది.  క్యాసినోలపై  28 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ విధించడంతో రూ.16,195 కోట్ల ట్యాక్స్ కట్టాలని ఈ కంపెనీకి జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ అధికారులు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తమ పర్మిషన్ లేకుండా ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వొద్దని బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీర్పిచ్చింది. డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సబ్సిడరీ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.23 వేల కోట్ల ట్యాక్స్ నోటీసును కిందటి నెలలో ఇష్యూ చేశారు. 

జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ రేటు 28 శాతం వద్ద   జులై, 2017 నుంచి మార్చి, 2022 మధ్య ఈ ట్యాక్స్‌‌ను లెక్కించారు. రూ.16,195 కోట్లకు సంబంధించి  ఫైనల్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇవ్వొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాంబే హైకోర్డు ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ షేర్లు సోమవారం రూ.130 దగ్గర ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముగిశాయి.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గ్యాంబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాసినో, హార్స్ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ 28 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ వేసినప్పటి నుంచి డెల్టా కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ షేరు 35 శాతం క్రాష్ అయ్యింది. 

యాక్షన్ తీసుకోవద్దన్న సిక్కిం హైకోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ నోటీసులను సవాలు చేస్తూ డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈ కంపెనీ సబ్సిడరీలు హైస్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డెల్టా ప్లీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూయిజ్ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కిందటి నెల 27 న హైకోర్టులో వ్రిట్ పిటీషన్ వేశాయి.  ఈ పిటీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 23 న బాంబే హైకోర్టు  పరిశీలించింది. తమ అనుమతి లేకుండా ఫైనల్ ఆర్డర్ ఇవ్వొద్దని తీర్పిచ్చింది. ఈ ఇష్యూపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 న హియరింగ్ ఉంటుంది. 

కాగా, డెల్టాకార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇష్యూ చేసిన రూ.628 కోట్ల జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ షాకాజ్ నోటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని తాజాగా సిక్కిం హై కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తీర్పిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెల్టా కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.69.40  కోట్ల నికర లాభం వచ్చింది. కంపెనీ రెవెన్యూ రూ.270.60 కోట్లుగా రికార్డయ్యింది.