ఏఐ స్కిల్స్కు డిమాండ్సెప్టెంబర్లో జాబ్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు 11.7 శాతం అప్

ఏఐ స్కిల్స్కు డిమాండ్సెప్టెంబర్లో జాబ్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు 11.7 శాతం అప్

ముంబై:  ఐటీ రంగంలో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది.  ఏఐ ఎక్స్​పర్టుల కోసం ఉద్యోగ ప్రకటనలు గత నెల11.7 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం (అక్టోబర్ 22) వెల్లడించింది. ఇవి గత సంవత్సరం ఇదే నెలలో 8.2 శాతం పెరిగాయి. గ్లోబల్​ హైరింగ్​ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఇండీడ్​ నివేదిక ప్రకారం, గత నెల ఉద్యోగ ప్రకటనల్లో 11.7 శాతం తమ జాబ్ డిస్క్రిప్షన్లలో ఏఐ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. 

ఇది మూడు నెలల క్రితం 10.6 శాతం, ఒక సంవత్సరం క్రితం 8.2 శాతంగా ఉంది.   చాలా మంది యజమానులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​పై దృష్టి సారించారని ఇండీడ్ ఏపీఏసీ సీనియర్ ఎకనామిస్ట్ కాల్లమ్ పికరింగ్ తెలిపారు.  ప్రస్తుతం ఏఐ- సంబంధిత అవకాశాలు టెక్ రంగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రంగాల్లోనూ ఏఐకి డిమాండ్​పెరుగుతోంది.  దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ స్కిల్​అవసరమని పేర్కొన్నారు.  

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ (23 శాతం), ఇన్సూరెన్స్ (18 శాతం), సైంటిఫిక్ రీసెర్చ్ (17 శాతం) రంగాల్లో కూడా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్​ ఉంది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (17 శాతం) నేతృత్వంలో, మెకానికల్ ఇంజనీరింగ్ (11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (9.2 శాతం)తో సహా అనేక ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఐ నైపుణ్యాలను కంపెనీలు కోరుతున్నాయి.  అయితే సెప్టెంబర్​లో జాబ్​ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు గత సెప్టెంబరుతో పోలిస్తే 0.8 శాతం తగ్గాయి.  ఈ సంవత్సరంలో వరుసగా ఆరో నెల కూడా జాబ్​ పోస్టింగ్స్​పడిపోయాయని ఇండీడ్​వెల్లడించింది.