ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

న్యూఢిల్లీ: ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రెండు ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్స్‌‌ను ప్రారంభించారు. ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఆయుర్వేద పేరుతో జామ్‌‌నగర్‌‌లో, నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పేరుతో జైపూర్‌‌లో మరో ఆయుర్వేద ఇన్‌‌స్టిట్యూట్స్‌‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని ఆరంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగిందని మోడీ అన్నారు.

‘వైద్య ప్రపంచంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోంది. అల్లోపతితోపాటు ఆయుర్వేదం కలసి ముందుకెళ్లే సమయం ఆసన్నమైంది. తొలిసారి మన పూర్వీకులు అందించిన విజ్ఞానం.. 21వ శతాబ్దపు సైన్స్‌‌తో అనుసంధానం అవుతోంది. కొత్త ఆయుర్వేదిక్ సెంటర్ల ద్వారా బాధ్యత మరింత పెరిగింది. ఈ కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్‌‌ను బోధించాలి. కరోనా పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్‌‌ను పెంచుకోవడంపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. టర్మరిక్, ఆయుర్వేదిక్ ప్రాడక్ట్స్‌‌కు దేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పసుపు పాలు, కఢా చాయ్ తాగుతున్నారు. అశ్వగంధ హెర్బల్స్‌‌ను వినియోగిస్తున్నారు’ అని మోడీ పేర్కొన్నారు.