
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది జనవరి– మార్చి మధ్య 29 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. కిందటేడాది ఇదే టైమ్‌లో రికార్డయిన 13 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వస్తుండడంతో పాటు మిగిలిన సిటీలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండడంతో బిజినెస్‌లకు, ఇన్వెస్టర్లకు, డెవలపర్లకు హైదరాబాద్ డెస్టినేషన్‌గా మారింది.