అమెరికా దారిలోనే కెనడా.. పుట్టుకతో పౌరసత్వానికి రద్దుకు ప్లాన్స్.. భారతీయులపై భారీ ప్రభావం..

అమెరికా దారిలోనే కెనడా.. పుట్టుకతో పౌరసత్వానికి రద్దుకు ప్లాన్స్.. భారతీయులపై భారీ ప్రభావం..

ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ అలాగే జన్మతః అక్కడే పుట్టిన పిల్లలకు వచ్చే పౌరసత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కెనడా కూడా ఇదే దారిలో ముందుకు సాగాలని చూస్తోంది. కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ దీనికి సంబంధించి కీలక ప్రతిపాదన చేసింది. తమ దేశంలో నివసిస్తున్న టెంపరరీ రెసిడెంట్లకు పుట్టే పిల్లలకు పుట్టుకతోనే వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయటంతో పాటు ఇమ్మిగ్రేషన్ రూల్స్ కూడా మార్చాలని కోరుతున్నారు. అయితే ఈ చర్యలు కెనడాలోని భారతీయ కుటుంబాలపై అధికంగా ప్రభావం చూపొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. 

అమెరికా మాదిరిగానే తల్లిదండ్రుల్లో ఒక్కరైనా పర్మనెంట్ రెసిడెంట్ లేదా కెనడియన్ పౌరులు అయినప్పుడు మాత్రమే వారికిపుట్టిన పిల్లలకు తమ దేశ పౌరసత్వం ఇవ్వాలని రాజకీయ నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం కెనడా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వంలోని లూప్ హోల్స్ కారణంగా పౌరసత్వం కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని.. ఇదొక కొత్తరకం టూరిజంగా మారిపోయిందని మిచెల్ రెంపెల్ గార్నర్ అన్నారు. 

కెనడా తీసుకొస్తున్న ఈ సంస్కరణలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల మాదిరిగా ఉండనుంది. ఈ ప్రతిపాదనకు పౌరసత్వ చట్టానికి సవరణ అవసరం అయినప్పటికీ, అది తక్షణ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. అక్టోబర్ 7న, ప్రభుత్వ బిల్లును సవరించడానికి గార్నర్ చేసిన ప్రయత్నాన్ని ఇమ్మిగ్రేషన్ కమిటీలోని లిబరల్, బ్లాక్ క్యూబెకోయిస్ ఎంపీలు తిరస్కరించారు. కెనడాకు రికార్డ్ స్థాయిలో వలసదారుల సంఖ్య పెరగుతున్న క్రమంలో సంక్షోభాన్ని నివారించటానికి ఈ ఆలోచనతో కన్జర్వేటివ్ పార్టీ నేతలు కోరుతున్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ రూల్స్ కూడా కఠినతరం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఈ ప్రతిపాదనను లిబరల్ జస్టిస్ మంత్రి సీన్ ఫ్రేజర్ తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రజలను భయపెట్టే చర్య అని కేవలం కెనడాలో పుడుతున్న ప్రజల్లో 1 శాతం మంది మాత్రమే పుట్టుకతో పౌరసత్వాన్ని అందుకుంటున్నట్లు చెప్పారు. ఈ చర్యలు దేశం లేని పిల్లలు అంటే గుర్తింపు లేని పిల్లల సంఖ్య పెంచవచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ మార్పుకు 48 శాతం మంది కెనడియన్ల నుంచి సానుకూలత ఉండగా మిగిలిన వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మెుత్తానికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 35 దేశాలు మాత్రమే పుట్టుకతో తమ పౌరసత్వాన్ని అపరిమితంగా ఆఫర్ చేస్తున్నాయి ప్రస్తుతం. కెనడా దీని నుంచి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నాలు అంత సులభం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.