తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళనలు చేస్తూనే ఉ న్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. తాజాగా నెక్కొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ మహమ్మద్ ఖాసిం బ్లేడుతో తన మెడ కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే మహమ్మద్ ఖాసింను ఆస్పత్రికి తరలించారు.
గత 69 రోజులుగా దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
