డెంగీ కేసులు పెరుగుతున్నాయి.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే!

డెంగీ కేసులు పెరుగుతున్నాయి.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే!

వర్షాకాలం ప్రవేశించడంతో  దేశంలో డెంగ్యూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒడిశా, అస్సాం, కేరళ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఆందోళనకరమైన పరిస్థితుల్లో దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు, సలహాలు తీసుకోవాలో ఆరోగ్య నిపుణులను అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డెంగ్యూ అనేది నాలుగు వేర్వేరు వైరస్‌ల వల్ల కలిగే సీజనల్ వ్యాధి. ఇది సాధారణంగా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాలు లేదా కీళ్ల నొప్పుల లక్షణాలకు కలిగిస్తుంది. ఈ వ్యాధి తీవ్రమైతే  రక్తస్రావం, కొన్ని సార్లు మరణానికి కూడా దారితీస్తుంది. అందువల్ల ప్రాణాంతకమయ్యే ఈ అనారోగ్యం నుంచి రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఏం చేయాలో ఈ కింది చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

ALSO READ :డ్రైనేజీలో ఆయిల్.. అదుపుతప్పుతున్న వెహికిల్స్

నివారణ చర్యలు చేపట్టండి

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి దోమలు వృద్ధి చెందకుండా నిరోధించడం. మీ ఇంటిలో, చుట్టుపక్కల ఉన్న బకెట్లు, నీటి కుంటలు, పూల కుండలు వంటి అన్ని నీటి నిల్వలను తొలగించండి. వీలైతే వాటిని దోమలు రాకుండా దోమతెర లేదా నెట్టింగ్ ఫాబ్రిక్‌తో కప్పి ఉంచండి.

క్రిమి నాశకాలను ఉపయోగించండి

మీకు మరియు మీ కుటుంబ సభ్యుల నుండి దోమలను దూరంగా ఉంచడానికి కీటక  నాశకాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు సబ్బులు, క్రీమ్ లు, స్ప్రేలు. రెండు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ వికర్షకాలను ఎప్పుడూ ఉపయోగించకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కప్పి ఉంచే దుస్తులు ధరించండి

దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో (ఉదాహరణకు తెల్లవారుజాము, సంధ్యా సమయంలో) మీరు బయట ఉన్నప్పుడు చేతులు, కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులను ధరించండి. పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు/స్కర్టులు దోమ కాటు నుంచి రక్షించుకోవడానికి సహాయపడతాయి.

పరిశుభ్రత పాటించండి

మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమలు వృద్ధి చెందకుండా నీరు నిల్వలను అరికట్టండి. చెత్త డబ్బాలు క్రమం తప్పకుండా ఖాళీ చేసేలా చూసుకోండి. ఏదైనా నీటి కంటైనర్లు లేదా పెంపుడు జంతువుల వస్తువులు కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి

మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా డెంగ్యూ బారిన పడ్డారని మీకనిపిస్తే, వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోండి. ప్రారంభ రోగనిర్ధారణ, చికిత్స లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల వ్యాధి మరింత తీవ్రం కాకుండా, ప్రమాదాన్ని నివారించడానికి దోహదపడుతుంది.