స్కూల్స్​ ఓపెనింగ్​ నాటికి బుక్స్​ అందాలి : రామారావు

స్కూల్స్​ ఓపెనింగ్​ నాటికి బుక్స్​ అందాలి : రామారావు

కొత్తగూడ, వెలుగు : పాఠశాలలు రీ ఓపెన్​ అయ్యేసరికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్​ అందించాలని డీఈఓ పి. రామారావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ వివరాలను రికార్డు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీదేవి, ప్రత్యేక అధికారి శ్రీనాథ్ ఉన్నారు.