జాతరకు ప్లాస్టిక్​ను తీసుకెళ్లొద్దు : డీఈఓ వెంకటేశ్వర్లు

జాతరకు ప్లాస్టిక్​ను తీసుకెళ్లొద్దు : డీఈఓ వెంకటేశ్వర్లు

సంగారెడ్డి టౌన్, వెలుగు: మేడారం సమ్మక్క–సారక్క జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను, పాలిథిన్ క్యారీ బ్యాగులను తీసుకెళ్లొద్దని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది హాజరయ్యే జాతరలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలన్నారు. చెత్తబుట్టల్లోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా ఆర్టీసీ వినియోగిస్తే పార్కింగ్ సమస్య ఉండదని భక్తులకు  సూచించారు.