మెదక్ టౌన్, వెలుగు: పదో తరగతిలో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో విజయ అన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, సర్ధన ప్రైమరీ స్కూళ్లను సందర్శించి మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలు 60 రోజుల్లో ఉన్నాయని, విద్యార్థులందరూ అన్ని సబ్జెక్టులపై దృష్టిపెట్టి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ప్రతి రోజు విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చేస్తున్న వేకప్ కాల్‌తో లేచి కఠినమైన విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టిపెట్టి వారికి గత సంవత్సరం వచ్చిన ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయిస్తూ ప్రతీ విద్యార్థి ఏ గ్రేడ్‌లోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో మధుమోహన్, హెడ్మాస్టర్లు వేణుశర్మ, అనిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
క్రీడలతో క్రమశిక్షణ, మానసిక స్థైర్యం
క్రీడలతో క్రమశిక్షణ, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని డీఈవో విజయ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ స్కూల్క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి పీఎంశ్రీ ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని క్రీడాస్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి నాగరాజు, పీడీలు మధు, మాధవరెడ్డి, వినోద్, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రవి, రాజేందర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
