హైదరాబాద్, వెలుగు: డేటా సెక్యూరిటీ, ఏఐ సేవలు అందించే దియోమ్ హైదరాబాద్‌లో కొత్త ఆఫీసును ప్రారంభించింది. ఇది ఇంజనీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్‌కు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. కంపెనీ ఈ క్వార్టర్ చివరి నాటికి 50కిపైగా ఉద్యోగులను నియమించుకోనుంది.
క్లౌడ్ ప్రొటెక్షన్, డేటా సెక్యూరిటీ ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ఫణి నాగార్జున మాట్లాడుతూ, హైదరాబాద్లో అద్భుతమైన టాలెంట్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, కంపెనీ సురక్షితమైన డేటా గవర్నెన్స్‌ను అందించడంలో దియోమ్ గ్లోబల్ మిషన్‌కు ఇది దోహదపడుతుందని అన్నారు.
