కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులనే జిల్లా అధ్యక్షులుగా నియమించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఎవరు ఎటు పోయినా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు అండగా నిలబడిందన్నారు. ఈ రోజు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తుందన్నారు.
ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి ..డిసెంబర్ లో తెలంగాణ రైసింగ్ ఏర్పాటు చేసుకున్నాం.సీఎం రేవంత్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తున్నాము . బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేశారు. ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. సన్న బియ్యం కోసం13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చాము. సీఎం రేవంత్ శ్రద్ధ తీసుకొని నాణ్యమైన చీరలని మహిళలకు ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాము . ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాము. రైతు భరోసా కింద రెండు లక్షల రుణమాఫీ 500 బోనస్ రైతులకు ఇస్తున్నాం. ఎప్పుడు పంట నష్టం జరిగినా కానీ లెక్క కట్టి మరి రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటుంది. ఎన్నో సంక్షేమ పథకాలు రైతుల కోసం ఏర్పాటు చేసాం . సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు కరెంటుకి ఇస్తున్నాం.
►ALSO READ | వడ్డించే వాడిని నేను ఎన్నికోట్లైనా సరే..రెండేండ్లలో కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లాలోని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ను ఆనాటి ప్రభుత్వం వదిలి వెళ్ళిపోతే తక్షణమే 100 కోట్ల రూపాయలు సాంక్షన్ చేపించి సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి జలాలు విడుదల చేసాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడబోతుంది . స్థానిక ఎలక్షన్లకు సంబంధించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి . ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఈ 10 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంతో పని చేసింది. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఎవరిని వదిలిపెట్టం అందరికీ న్యాయం జరుగుతుంది. అనేక గ్రామాల్లో భౌతిక దాడులు ఎదుర్కొన్నాం. మహిళలకు ధైర్యం కలిపించుకోవటం శాంతియాత్ర చేపట్టం.పొంగులేటి. తుమ్మల సహకారంతో ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం ఏర్పాటు చేసుకున్నాం. మరి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కమిటీ ఏర్పాటు చేస్తాం’అని అన్నారు.
