బీఆర్ఎస్ వెనుక బీజేపీ...! అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటోంది.. !

బీఆర్ఎస్ వెనుక బీజేపీ...! అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటోంది.. !

బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తూ ఎన్ని కల కమిషన్ కు కంప్లయింట్ చేశారని ఆరోపించారు. రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిని చేశారని అన్నారు. శ్రీ గంగానగర్ జిల్లా శ్రీకర ణ్ పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ ను పోలింగ్ కు 20 రోజుల ముందు మంత్రి వర్గం లోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే తప్పు లేనిది. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయకుండా గవర్నర్ పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. 

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపిం చేందుకు బీజేపీ సర్వశక్తుల ఒడ్డుతోందని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణ నిజమేనని స్పష్ట మవుతోందని చెప్పారు. అనైతికంగా అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని అన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజ లకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞుల ని ఒక్క సారి ఈ రెండు పార్టీల చీకటి బాగోతాన్ని గమనించాలని అన్నారు. అజారుద్దీన్, కోదండరాం ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి రాజ్ భవన్ కు పంపితే గవర్నర్ పెండింగ్ లో పెట్టారని అన్నారు. 

►ALSO READ | రేపు (అక్టోబర్ 31) రాజ్ భవన్లో మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణ స్వీకారం

కోర్టులో గెలిచి తీరుతామని అన్నారు. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రావడం ఖాయమని, మంత్రిగా మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడతారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్కు మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చి 8 స్థానాల్లో గెలిపించిందని ఆరోపిం చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బిజేపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టు అర్థ మవుతోందని అన్నారు. ఒక మైనార్టీ వర్గానికి చెందిన అంతర్జాతీయ క్రీ డాకారుడు, భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన క్రికెటర్ రాష్ట్ర మంత్రి అవుతుంటే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

రెండు పార్టీలూ కలిసి కుమ్మక్కు డ్రామా నడుపుతున్నాయని ప్రజలు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు వస్తున్న ప్రజాదరణనుచూసి ఓర్వలేకనే రెండు పార్టీలు కలిసి కుట్రలుచేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోమారు రుజువైందని తెలిపారు.