
మధిర, వెలుగు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు. భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి మధిరకు వస్తున్నారు. మధిర మండలంలోని ఆత్కూరు చెక్‌పోస్ట్ వద్దకు రాగానే ఆయన కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. భట్టి విక్రమార్క వాహనంతో పాటు, కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను తనిఖీ చేశారు.