నల్లమలలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నల్లమలలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  •   ‘పాలమూరు’ పనుల్లో స్పీడ్​ పెంచండి

కొల్లాపూర్/ వనపర్తి, వెలుగు: నల్లమల ప్రాంతంలో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మెఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమశిల దగ్గర కృష్ణానదిలో టూరిజం లాంచీలో ప్రయాణించారు. 

అనంతరం స్పీడ్ బోట్ ఎక్కి నల్లమల అందాలకు చూశారు. అనంతరం టూరిజం కాటేజి ఇరిగేషన్, విద్యుత్, విద్య, ఇతర కీలక శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచి ఉదండాపూర్ వరకు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థులకు ఇలాంటి సమస్యలు లేకుండా మెరుగైన వసతులు కల్పించాలన్నారు. 

అంతకుముందు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరులో రూ.2.22 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్​ స్టేషన్​ను మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్, ఏడీసీ సుబ్రహమణ్యం పాల్గొన్నారు.