రుషికొండ భవనాలపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

రుషికొండ భవనాలపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వైసీపీ హయాంలో నిర్మించిన వైజాగ్ రుషికొండ భవనాలపై జరిగిన హైడ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి సీఎం జగన్ విలాసాల కోసం ఈ భవనాలు నిర్మిస్తున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణానికి హాని కలిగించేలా ఈ భవనాల నిర్మాణం చేపట్టారని అప్పటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో సైతం రుషికొండ భవనాల అంశంలో కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ కట్ చేస్తే.. రుషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తి అని స్వయంగా కూటమి నేతలే చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ లోని రుషికొండ భవనాల్లో జనసేన క్యాడర్ తో సమావేశంలో పాల్గొన్న పవన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తి అని.. టూరిజం శాఖ ఆస్తి అని అన్నారు పవన్. ఇకపై రుషికొండ ప్యాలెస్ లు అంటూ మాట్లాడుకోవడం అనవసరం అని అన్నారు పవన్. ఈ కట్టడాలను అద్భుత ఆదాయ వనరుగా మార్చాలని అన్నారు. 4 వందల 50 కోట్లు ఖర్చు చేసిన ఈ భవనాల నుంచి కనీసం 700 కోట్ల ఆదాయం వచ్చేలా చేయాలని అన్నారు పవన్.

సంపద సృష్టికి ఈ కట్టడాలు ఒక అవకాశమని అన్నారు. సీతాలలానికి ముందే ఈ భవనాలను అందుబాటులోకి తేవాలని. డెస్టినేషన్ వెడ్డింగ్ లకు చాలా అనువుగా ఉంటుందని అన్నారు పవన్. దుబాయ్ MICE తరహాలోనే వైజాగ్ MICE గా ఈ భవనాలను మార్చుకోవచ్చని అన్నారు పవన్. ఈ అంశంపై జనసేన తరపున తీర్మానం చేసి సీఎం చంద్రబాబుకు ఇస్తామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్.

అప్పట్లో జగన్ సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నారంటూ ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు రుషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తే అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి, పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుంది.. జనసేన చేసే తీర్మానంపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాలి.