గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది : దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది : దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్

బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ పవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని.. మీరు చాలా సంతోషంగా ఉంటారని అంటుండే వారని అన్నారు పవన్ కళ్యాణ్. ఆ దిష్టి తగిలిందేమో ఇప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్ల మొండాలు మాత్రమే మిగిలాయని అన్నారు పవన్ కళ్యాణ్.

నరుడి దిష్టికి నల్లరాయి అయినా మిగిలిపోతుందని అంటారు.. అలాంటిది కోనసీమ పచ్చదనం కూడా ఎంతోమంది దిష్టి తగిలి.. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు మాత్రమే మిగిలే పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం నాశనం అయితే... ఆ నెపాన్ని పక్క రాష్ట్రం మీద మోపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇదిలా ఉండగా.. కొబ్బరి రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి లేనిదే.. భారతీయ సంస్కృతి లేదని.. మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.