బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేల లంచం తీసుకుంటూ దొరికిండు

బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేల లంచం తీసుకుంటూ దొరికిండు

బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్.  మాసబ్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ను  జితేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం కలిశాడు. అయితే అందుకు రూ.75 వేల లంచం అడిగాడు జగన్మోహన్. 

అంత ఇచ్చుకోలేనని జితేందర్ చెప్పడంతో రూ. 50 వేలు డిమాండ్ చేశాడు  జగన్మోహన్. దీంతో నేరుగా జితేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  దీంతో పక్కా ప్లాన్ ప్రకారం  జితేందర్ రెడ్డిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  అనంతరం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఏసీబీ అధికారులు.  

ALSO READ :- బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే