స్పేస్ సెక్టార్‌‌‌‌ వృద్ధి చెందాలంటే రూల్స్ తగ్గించాలి : ఎస్ సోమనాథ్‌‌

స్పేస్ సెక్టార్‌‌‌‌ వృద్ధి చెందాలంటే  రూల్స్ తగ్గించాలి :   ఎస్ సోమనాథ్‌‌

న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్  వృద్ధి చెందాలంటే  అనవసరమైన రూల్స్‌‌ను తొలగించాలని, సెక్టార్‌‌‌‌ను కంట్రోల్ చేయడం తగ్గించాలని  ఇస్రో చైర్మన్‌‌ ఎస్ సోమనాథ్‌‌ పేర్కొన్నారు. స్పేస్‌‌ సెక్టార్‌‌‌‌లోకి ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఈ రంగం వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పారు.  ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం వలన శాటిలైట్లను నిర్మించే సామర్ధ్యం పెరుగుతుందని అన్నారు.

 ‘గతంలో  కేవలం ఇస్రోనే శాటిలైట్లు, లాంచ్ వెహికల్స్‌‌, స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీని  డెవలప్‌‌ చేసేది. వీటి ప్రొడక్షన్ కూడా చేపట్టేది.  ఇస్రోలో పనిచేస్తోంది కేవలం 17 వేల మందే. కేటాయిస్తున్న బడ్జెట్‌‌ రూ.13 వేల కోట్లే’ అని సోమనాథ్ పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఇండియాలో స్పేస్‌‌ సెక్టార్‌‌‌‌లో 130 స్టార్టప్‌‌లు ఉన్నాయని, కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు 400 నుంచి 500 వరకు ఉన్నారని చెప్పారు. వీటి టర్నోవర్ రూ.500 నుంచి రూ. వెయ్యి కోట్లు ఉందని అన్నారు. రిటైర్డ్ అయిన ఇస్రో సైంటిస్టులకు మంచి డిమాండ్ ఉందని, కొన్ని కంపెనీలు హై శాలరీలను ఇస్తున్నాయని వెల్లడించారు.