షాంపూ మార్చేముందు ఇవి గుర్తు పెట్టుకోండి

షాంపూ మార్చేముందు ఇవి గుర్తు పెట్టుకోండి

తలస్నానానికి వాడే షాంపూ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. అయితే వాటిల్లో అపోహలే ఎక్కువ అంటోంది డెర్మటాలజిస్ట్​ డాక్టర్​. జయశ్రీ శరద్​. అవేంటంటే..

నాలుగు వెంట్రుకలు రాలగానే షాంపూ మార్చేస్తుంటారు చాలామంది. కానీ, నిజానికి ఏ షాంపూ హెయిర్​ ఫాల్​ని​ కంట్రోల్​ చేయదు. అందుకని మాడు మీది చర్మం పొడిగా ఉందా? జిడ్డుగా  ఉందా? అనే విషయంతో పాటు సీజన్​ని దృష్టిలో పెట్టుకొని షాంపూ మార్చాలి. రోజూ తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందనేది అపోహ మాత్రమే. రోజూ దుమ్ము, ధూళి జుట్టులోకి చేరతాయి. చెమట వల్ల తల్లో క్రిములు చేరుతుంటాయి. అందుకే రెగ్యులర్​గా తలస్నానం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఎక్సర్​సైజ్​ చేసేవాళ్లు, జుట్టు ఒత్తుగా ఉన్నవాళ్లు తలస్నానం తప్పక చేయాలి. 

సల్ఫేట్​తో తయారుచేసిన షాంపూలు జుట్టుకి హాని చేస్తాయన్నది నిజం కాదు. సల్ఫేట్ మంచి ​ క్లెన్సింగ్​ ఏజెంట్​. ఇది జుట్టులోని జిడ్డు, దుమ్ము, ధూళిని పోగొడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా వాడితే జుట్టు పొడిబారుతుంది. మాడు మీద సహజంగా ఉండే నూనె పోతుంది. ఒకవేళ చర్మం సెన్సిటివ్​ అయితే ఇబ్బందులు వస్తాయి. అందుకే జుట్టు, మాడు కండిషన్​ని బట్టి  షాంపూ ఎంచుకోవాలి. షాంపూని కేవలం జుట్టుకి మాత్రమే అప్లయ్​ చేయాలనేది మరో అపోహ. అసలు షాంపూ వాడేదే జుట్టులోని దుమ్ము, ధూళిని పోగొట్టడానికి. అందుకే మాడుకు షాంపూ పెట్టాల్సిందే.