RTC ఆస్తులు..అప్పుల వివరాలు

RTC ఆస్తులు..అప్పుల వివరాలు

-ఇవీ ఆర్టీసీ ఆస్తులు
-రూ. 500 కోట్ల బస్‌‌ భవన్‌‌
-97 బస్‌‌ డిపోలు
-364 బస్టేషన్లు
-పది వేల బస్సులు
-14 దవాఖానలు
-రెండు జోనల్‌‌ వర్క్‌‌ షాపులు
-ఒక బస్‌‌ బిల్డింగ్‌‌ యూనిట్‌‌
-రెండు టైర్‌‌ రిట్రీడింగ్‌‌ షాపులు
-ఒక ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌
-ఒక ట్రాన్స్‌‌పోర్టు అకాడమీ

ఒక్కో డిపో సుమారు 10 ఎకరాల విశాల స్థలంలో విస్తరించి ఉంటుంది. బస్‌‌ స్టేషన్లు రెండు నుంచి నాలుగు ఎకరాల భూమిలో ఉంటాయి. సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే బస్‌‌ భవన్‌‌, అంతే విలువ చేసే ఎండీ ఆఫీసు హైదరాబాద్‌‌ నగరం నడిబొడ్డున ముషీరాబాద్‌‌లో ఉన్నాయి. అక్కడే ముషీరాబాద్‌‌ 1, 2, 3 డిపోలతోపాటు ఒక గెస్ట్‌‌ హౌజ్‌‌ ఉంది. ఇవన్నీ కలిపి ఇంచుమించుగా పది ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అంటే కేవలం ఒక్క చోటే ఆర్టీసీకి పదిహేను వందల కోట్ల విలువ చేసే భూములున్నాయి. వీటికి దగ్గర్లోనే రెండెకరాల్లో ఆర్టీసీ కల్యాణ మండపం కూడా ఉంది. తార్నాకలో విశాలమైన కార్పొరేట్‌‌ తరహా హాస్పిటల్​ ఉంది. విశాలమైన ఎంజీబీఎస్‌‌, జేబీఎస్‌‌ బస్టాండ్లు, గోషామహల్‌‌ డోమ్‌‌ ఆర్టీసీ విలువైన స్థలాల్లో ముఖ్యమైనవి. వీటితోపాటు కరీంనగర్‌‌, వరంగల్‌‌ పలు జిల్లాల్లో కీలకమైన ప్రాంతాల్లో అన్నీ కలిపి రూ. 50 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి.

అప్పులు 3వేల కోట్లు

ఇక ప్రైవేటు బస్సులేనా?

త్వరలో ఆర్టీసీలో 30 శాతానికి చేరనున్న అద్దెబస్సులు
20% పూర్తిగా ప్రైవేటు బస్సులు
ఆర్టీసీలో పనికి రాకుండా పోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె, ప్రైవేటు బస్సులు తెస్తామన్న ప్రభుత్వం
ఆర్టీసీలో ఏటా ఐదు నుంచి పది శాతం బస్సులు ఔట్‌ డేటెడ్‌గా మారుతాయి. వాటి స్థానంలో కూడా అద్దె, ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టి క్రమంగా ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర ఉందని కార్మికులు అంటున్నారు.  రాష్ట్రంలో రోజూ దాదాపుగా కోటి మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2,000 వరకు అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులే నష్టాల్లో ఉన్నాయి. ఇలా ఎందుకనే సందేహం సాధారణంగానే తలెత్తవచ్చు. ఆర్టీసీ లాభదాయకమైన లాంగ్‌ రూట్లలోనే కాకుండా అంతగా ఆదాయం రాని పల్లెలకు కూడా బస్సులు నడుపుతోంది. పల్లె వెలుగు బస్సులపై ఆర్టీసీకి తగిన ఆదాయం రాక నష్టపోతోంది. సామాజిక బాధ్యతగా ఈ రూట్లలో బస్సులు నడుపుతున్నందున నష్టాన్ని ప్రభుత్వం భరించాలని కార్మికులు అడుగుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీన్ని పక్కనబెట్టి ఆర్టీసీలో అద్దె బస్సులు, ప్రైవేటు బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.