
ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ దేశంకి చేరవేస్తుందనెపంతో కొంతకాలం జ్యోతి మల్హోత్రా అనే మహిళాని అరెస్టు చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అయితే దీనికి సంబందించి తాజాగా మరో విషయం వెల్లడైంది. 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాని గతంలో కేరళ పర్యాటక శాఖ అధికారిక డిజిటల్ ఔట్రీచ్ ప్రచారంలో భాగంగా నియమించుకున్నట్లు ఆర్టీఐ బయటపెట్టింది.
ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా, కేరళను ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి 2024 నుండి 2025 మధ్య కేరళ రాష్ట్రం ఆహ్వానించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ లిస్టులో ఆమె కూడా ఉన్నారు. పర్యాటక రంగంలో ఇన్ఫ్లుయెన్సర్ల సహకార కార్యక్రమం కింద ఆమె ప్రయాణం, వసతి ఇంకా ప్రయాణ ఖర్చులను కూడా పూర్తిగా కేరళ ప్రభుత్వం భరించింది.
RTI ప్రకారం, జ్యోతి మల్హోత్రా కన్నూర్, కోజికోడ్, కొచ్చి, అలప్పుజ, మున్నార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ప్రయాణించి, తన అనుభవాలను యూట్యూబ్ ప్రేక్షకుల కోసం వీడియోలతో డాక్యూమెంటరీ చేసింది. అయితే ఆమె వీడియోలలో ఒక వీడియో వైరల్ అయ్యింది, అందులో ఆమె కన్నూర్‌లో జరిగిన తెయ్యం షోకు హాజరైనప్పుడు ఆమె సాంప్రదాయ కేరళ చీరలో కట్టుకున్నట్లు కనిపించింది.
అయితే, ఆమె అరెస్టు ఈ కార్యక్రమంపై పలు అనుమానాలు రేకేతించింది. ఎందుకంటే భారత నిఘా సంస్థలు చేస్తున్న దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా చాల సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించి, భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందితో సహా పాకిస్తాన్ నిఘా సేవల అధికారులతో పరిచయాలు ఏర్పరచుకున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక అధికారుడిని కూడా తొలగించింది.
భారతదేశంలోని చాల రాష్ట్రాలలో పనిచేస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై కేంద్ర సంస్థలు చేపట్టిన దాడుల్లో ఆమె అరెస్టు జరిగింది. ఈమెతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
జ్యోతి మల్హోత్రా అరెస్టు జాతీయ భద్రతా లొసుగులు, ప్రభుత్వ నిధులతో జరిగే ప్రచారాలలో పాల్గొనే వారి గురించి తీవ్రమైన ఆందోళనలను కలిగించింది. ఆమె చేసిన 487 యూట్యూబ్ ఛానెల్ వీడియోలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ అనేక భారతీయ రాష్ట్రాల కంటెంట్ ఉంది. ప్రస్తుతం ఆమె చేసిన కంటెంట్ నిఘా సంబంధాల పరిశీలనలో ఉంది.