దేవన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కృష్ణ లీల’. సూపర్ నేచురల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. జి జ్యోత్స్న నిర్మిస్తున్నారు. అనిల్ కుమార్ జి కథ, మాటలు అందించాడు. సోమవారం (Oct 27) ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
‘ప్రేమించడం, ప్రేమించబడటం.. రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అది మరింత కాంప్లికేటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు’అనే డైలాగ్ ఆసక్తి పెంచుతోంది. గత జన్మలో విఫలమైన ప్రేమను ప్రస్తుత జన్మలో తిరిగి సాధించాలనుకునే ప్రేమికుడి కథగా సినిమా నడుస్తుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన నిర్మాత సురేష్ బాబు, సిబిఐ మాజీ డైరెక్టర్ జే.డి. లక్ష్మీ నారాయణ సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌ను విష్ చేశారు. హీరో దేవన్ మాట్లాడుతూ ‘హానెస్ట్‌గా తీస్తే అందరూ సపోర్ట్ చేస్తారని మా సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా యుద్ధాలైనా చేస్తూనే ఉండాలి. చివరిగా ప్రేమను గెలిపించడమే నిజమైన ప్రేమ.
అలాంటి ప్రేమను ఈ చిత్రంలో చాలా థ్రిల్లింగ్‌గా చూపించబోతున్నాం’ అని చెప్పాడు. దీనికోసం సిన్సియర్‌గా వర్క్ చేశామని ధన్య బాలకృష్ణ చెప్పింది. టీమ్ వర్క్‌తో ముందుకెళ్లామని, ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని నిర్మాత జ్యోత్స్న అన్నారు. రైటర్ అనిల్ కుమార్ కూడా పాల్గొన్నాడు.
