త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కోస్టల్ ఏరియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. అతి త్వరలో ‘దేవర’ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

ఈనెల 20న మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆరోజు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా తారక్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంతోష పరిచేలా ఈ పాటను విడుదల చేయనున్నారు.  కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు హృతిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ నుంచి కూడా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ రానుంది. అలాగే ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమా నుంచి కూడా క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.