మాజీ ప్రధాని దేవె గౌడ బెంగళూరులో రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీచేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్నా, జేడీఎస్ చీఫ్ హెచ్‌కే కుమారస్వామితో పాటు ఇతరులు కూడా నామినేషన్ దాఖలు సమయంలో ఉన్నారు. తన పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి ఎంకేఈ విశాలాక్షికి అందజేశారు.
దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, రాజస్థాన్ లో మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్, మేఘాలయలో ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ దేశంలో కరోనా కారణంగా లాకడౌన్ విధించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా లాక్ డౌన్‌ను సడలించడంతో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త తేదీలను ప్రకటించింది.

