రూ.కోటితో ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 

రూ.కోటితో ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ 

అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని రూ.కోటితో అభివృద్ధి చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధవారం ఉమామహేశ్వర ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవసారి ఆలయ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన బీరం మాధవరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. 

ఆలయ ప్రాంగణం లో నూతన సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, భక్తులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు రంగాపూర్ సర్పంచ్ శివ, నాయకులు పాల్గొన్నారు.