రెండు రోజుల గ్యాప్ తర్వాత తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

రెండు రోజుల గ్యాప్ తర్వాత తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చర్చలు ఇరాన్ యుద్ధానికి ముగింపు పలుకుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ముగించి హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించాలని చేస్తున్న ప్రయత్నాలను బులియన్ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలోనే గడచిన రెండు రోజులుగా ఎలాంటి చలనం లేకుండా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో రిటైల్ ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించటం బెటర్. 

జూన్ 4న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.11 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 611గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 310గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 4, 2026న దేశవ్యాప్తంగా మార్పు లేకుండా స్థిరంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 85వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.285 దగ్గర ఉంది.