కాసేపట్లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం..?

 కాసేపట్లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం..?

మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. గోవా నుంచి ముంబయికి చేరుకున్న శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత, మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై చర్చించారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 12 మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఫడ్నవీస్, షిండేలు గవర్నర్ కోశ్యారీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.

గవర్నర్తో భేటీ అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు సాయంత్రమే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.