ఘనంగా బాసర దేవీ నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా బాసర దేవీ నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.