కంటెంట్‌‌‌‌పై క్లారిటీ వస్తే తప్ప.. అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ గురించి స్పందించం : కళ్యాణ్ రామ్

 కంటెంట్‌‌‌‌పై క్లారిటీ వస్తే తప్ప.. అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ గురించి స్పందించం :  కళ్యాణ్ రామ్

ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించాలని తానెప్పుడూ  ప్రయత్నిస్తుంటాను అని చెప్పాడు కళ్యాణ్ రామ్. అలాగే పాత్రను చేసేటప్పుడు తానేమీ ప్రత్యేకమైన పద్ధతులను పాటించనని,  కథలో ఉండే క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తే.. డైలాగ్ డెలివరీ, నటించే పద్ధతి అన్నీ మారిపోతాయి అన్నాడు.  ఆయన హీరోగా అభిషేక్ నామా దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ‘డెవిల్’ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు.

 రచయిత శ్రీకాంత్ విస్సా కథ చెప్పినప్పుడు హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌‌‌‌గా అనిపించింది. 1940 బ్యాక్ డ్రాప్‌‌‌‌లో సాగే  కథ ఇది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమానే  ‘డెవిల్’.  ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉండటం  కొత్తగా అనిపించింది. ఇది పక్కా ఫిక్షనల్ మూవీ.  ఈ చిత్రంలో ఎలాంటి గ్రే షేడ్స్ ఉండవు.  ప్రతి విషయాన్ని  టీమ్ అంతా ఎంతో డీటెయిల్డ్‌‌‌‌గా వర్క్ చేశాం. సిల్వర్ స్క్రీన్‌‌‌‌పై చూసేటప్పుడు దానిని ఎంజాయ్ చేస్తారు.  ఇందులోని హై మూమెంట్స్, దేశభక్తి గురించి చెప్పాలంటే సినిమా చూడాల్సిందే.  సంయుక్త మీనన్, మాళవికా నాయర్ పాత్రలు చాలా చక్కగా ఉంటాయి. హీరోకు సమానంగా వీరిద్దరి పాత్రలు ఉంటాయి.  వీరితో పాటు ప్రతీ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుంది.   విజువల్స్ మేం ఊహించిన దానికంటే మించేలా అందించారు సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్. కథ వినేటప్పుడు ఎలా ఉంటుందని అంచనా వేసుకున్నానో దానికి రెట్టింపు ఇచ్చారు. ఫస్ట్ లుక్‌‌‌‌తో నా క్యారెక్టర్‌‌‌‌కి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారు. 

హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ చేస్తున్నాడు అనగానే హ్యాపీగా అనిపించింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్ష అందించిన బీజీఎం చాలా బాగుంటుంది.  డెవిల్ విషయానికి వస్తే పాటలు ఓ వైపు ఉంటే.. బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ దాన్ని బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్‌‌‌‌గా హర్ష చేశాడు.  ఈ సినిమాకు సీక్వెల్ గురించి ఓసారి డిస్కషన్ చేశాం. నలభై శాతం వరకూ స్క్రిప్ట్ వర్క్  చేసి.. ఓ దశలో షూటింగ్ కూడా చేయాలనుకున్నాం. కానీ ఫైనల్‌‌‌‌గా వద్దనుకున్నాం. వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం.   నటనలో ఎంత కష్టపడాలో ప్రొడక్షన్‌‌‌‌లో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. 

ఆ తర్వాత మా బ్యానర్ లో చేసే సినిమాలకు సంబంధించిన కథ వింటాను. మిగిలిన విషయాలను మా హరిగారు చూసుకుంటారు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్‌‌‌‌పై ఉంది. దాని తర్వాత ‘బింబిసార2’ స్టార్ట్ చేస్తాను. మేము చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం. అందుకనే  అవుట్‌‌‌‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ‘దేవర’ విషయంలో నేను, తారక్ క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం.  కంటెంట్‌‌‌‌పై క్లారిటీ వస్తే తప్ప.. అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ గురించి స్పందించకూడదని నిర్ణయించుకున్నాం.