తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్... బయటకొచ్చిన ఆనంద నిలయం వీడియో

తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్... బయటకొచ్చిన ఆనంద నిలయం వీడియో

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి  దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీశాడు.  దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

ఆగమాశాస్త్రం ప్రకారం తిరుమల ఆనంద నిలయంపై నుంచి విమానాలు వెళ్లరాదు. దాన్ని ఫొటోలు తీయడం కూడా తప్పు. అలాంటిది ఏకంగా ఒక భక్తుడు వీడియో తీయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజలెన్స్ దర్యాప్తు చేపట్టింది.  వీడియో తీసిన భక్తుడ్ని  గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  

తిరుమల కొండపై ఎప్పుడు భారీ బందోబస్తు ఉంటుంది. సెక్యురిటీ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తారు. అలాంటిది ఒక భక్తుడు ఫోన్ ఎలా తీసుకెళ్లాడో అధికారులకు అంతుపట్టడం లేదు. ఇక  ఇటీవల తిరుమల కొండకు టెర్రరిస్టుల ముప్పు ఉందని హెచ్చరికలు వచ్చాయి. దాంతో పాటు తిరుమల కొండపై విమానాలు చక్కర్లు కొట్టాయి.  ఇలా  నిత్యం ఏదో ఒక చోట అపచారం జరుగుతుండడంతో భక్తులు అధికారులు మండిపడుతున్నారు.