రద్దీ నేపథ్యంలో సోన్ ప్రయాగ్ లో భక్తుల నిలిపివేత

 రద్దీ నేపథ్యంలో సోన్ ప్రయాగ్ లో భక్తుల నిలిపివేత

చార్ ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో సోన్ ప్రయాగ్ లో భక్తులను పోలీసులు, ITBP ఆఫీసర్లు నిలిపివేశారు. భక్తుల రద్దీ పెరగడంతో.. యాత్రలో ఇబ్బందులు ఏర్పడుతాయని.. భక్తులను ఆపేశామన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుంచి భక్తులను కేదార్ నాథ్ ధామ్ కు పంపిస్తామని రుద్రప్రయాగ్ సర్కిల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. కోవిడ్మ హమ్మారి తగ్గుముఖం పట్టడంతో రెండేండ్ల తర్వాత యాత్ర పున:ప్రారంభమైంది. దీంతో భక్తులు కేదార్ నాథ్ ధామ్ కు భారీగా తరలివస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి