కురుమూర్తి స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కురుమూర్తి స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిన్న చింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి దేవస్థానానికి గురువారం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. శ్రావణ తొలి అమావాస్య ప్రారంభం కావడంతో జిల్లాతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఈవో మహేశ్వరరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.