మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
  •     పండుగ పూట పెరిగిన రద్దీ

కొమురవెల్లి, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా కొమురవెల్లి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, సంప్రదాయబద్ధంగా బెల్లం పాయసం వండి బోనం సమర్పించారు. కోరిన కోరికలు తీర్చమని గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు.

మల్లన్న స్వామి సోదరి ఎల్లమ్మతల్లికి కల్లు, బెల్లం పానకం, ఒడిబియ్యం సమర్పించారు. ఈవో బాలాజీశర్మ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. కాగా మల్లన్న పట్నాలు వేసేందుకు ఒగ్గు పూజారులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇవ్వకుంటే నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు.