కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు మల్లన్న కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. మల్లన్నకు బోనం సమర్పించి పట్నాలను వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి వేడుకున్నారు. 

మల్లికార్జున స్వామిని నాచారం లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ పల్లె రవి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రసాదం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈవో అన్నపూర్ణ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఉన్నారు.