ఏడుపాయల వనదుర్గామాత ఆలయనికి పోటెత్తిన భక్తులు

ఏడుపాయల వనదుర్గామాత ఆలయనికి పోటెత్తిన భక్తులు

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే అర్చకులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.

 అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.